స్నో మ్యాన్ టాస్క్ లో గెలిచిందెవరంటే.. ఎల్లో కార్డ్ ఆ టీమ్ కే!
on Oct 30, 2024
బిగ్‌బాస్ సీజన్-8 నిన్నటి ఎపిసోడ్ ఇంటెన్స్ గా సాగింది. ఒక్కొక్కరు తన్నుకునేదాకా పోయింది. అసలేం జరిగిదంటే.. హౌస్‌లో ఇప్పటి నుంచి రాయల్స్, ఓజీ క్లాన్స్ ఉండవు.. ఒకే ఒక్క మెగా క్లాన్.. అదే బీబీ క్లాన్.. ఇప్పటినుంచి మీ ఆట కూడా పూర్తిగా మీ చేతుల్లోనే అని బిగ్‌బాస్ చెప్పాడు.
మొదటి టాస్క్.. బీబీ ఇంటికి దారేది.. ఈ టాస్కు కోసం సభ్యులంతా నాలుగు టీమ్‌లుగా విడిపోవాల్సి ఉంటుంది.. ఈ టాస్కులో గెలవడానికి ప్రతి టీమ్ డైస్‌ను రోల్ చేస్తూ బీబీ ఇంటి వైపు కదలడానికి ప్రయత్నించాలి.. కానీ మీ ప్రత్యర్థులతో తలపడి ఛాలెంజ్‌లో గెలిచినప్పుడే డైస్ రోల్ చేసే ఛాన్స్ వస్తుంది.. అందరకన్నా ముందుగా ఏ సభ్యులైతే బీబీ ఇంట్లోకి లేదంటే ఇంటి దగ్గరిగా చేరుతారో వారు మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారు.. నాలుగు టీమ్‌లు ముగ్గురేసిగా విడిపోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. గౌతమ్, ప్రేరణ, యష్మీ టీమ్ రెడ్. అవినాష్, నిఖిల్, హరితేజ టీమ్ బ్లూ. తేజ, విష్ణుప్రియ, నబీల్ టీమ్ గ్రీన్. రోహిణి, పృథ్వీ, నయని టీమ్ ఎల్లో.. మీరందరూ కలిసి నిర్ణయించుకొని గంగవ్వను ఏదో ఒక టీమ్‌లోకి తీసుకోండి.. ప్రతి టీమ్‌లో ఒక లీడర్.. ఇద్దరు ఫాలోవర్స్ ఉంటారు.. తెలివిగా లీడర్‌ను ఎంచుకోండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
బీబీ ఇంటికి దారేది టాస్కులో ఇచ్చే మొదటి ఛాలెంజ్.. మంచు మనిషి.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయాల్సింది అల్లా మీ ముందున్న భాగాలను ఉపయోగించి మీ టీమ్‌కి సంబంధించిన స్నో మ్యాన్‌ను ముందుగా పూర్తి చేయాలి.. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇందులో పాల్గొనే ముగ్గురు సభ్యులు కలిసి ఒకే జత స్కీస్‌ను ధరించి మందుకు కదలాల్సి ఉంటుంది.. ఈ టీమ్ అయితే ముందుగా వారి టీమ్‌కి సంబంధించిన స్నో మ్యాన్‌ను పూర్తి చేస్తారో ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు.. గెలిచిన టీమ్ లీడర్‌కి రెండు డైస్‌ను రోల్ చేసే అవకాశంతో పాటు ఓడిపోయిన మిగిలిన టీమ్ నుంచి ఒక టీమ్‌కి ఎల్లో కార్డ్ ఇచ్చే అవకాశం లభిస్తుంది.. ఎప్పుడైతే ఒక టీమ్‌కి రెండు ఎల్లో కార్డ్స్ వస్తాయో ఆ టీమ్ లీడర్ తమ టీమ్ నుంచి ఒక సభ్యుడ్ని ఆట నుంచి తప్పించాల్సి ఉంటుంది.. లీడర్ రెండు డైస్‌ను రోల్ చేసినన తర్వాత ఆ డైస్‌ను ఒక వ్యక్తికే కేటాయించొచ్చు.. లేదా ఒక్కో డైస్‌ను ఒక్కొక్కరికి ఉపయోగించి ఇద్దరు సభ్యులు ఆటలో ముందుకు కదలడానికి ఉపయోగించొచ్చు అంటూ బిగ్‌బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఇందులో హరితేజ టీమ్ మొదటగా గెలిచింది. హరితేజ రెండుసార్లు డైస్ ని రోల్ చేయగా మొదట ఆరు, తర్వాత మూడు నెంబర్లు వచ్చాయి. హరితేజ టీమ్ కి ఎల్లో కార్డ్ వస్తుంది. దానిని హరితేజ టీమ్ వాళ్ళు రెడ్ టీమ్ కి ఇచ్చారు.
Also Read